Share News

SA Vs IND: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇండియా సిరీస్ నుంచే అమలు

ABN , First Publish Date - 2023-12-11T19:35:45+05:30 IST

New Rule: క్రికెట్‌ను మరింత రంజుగా మార్చేందుకు ఐసీసీ కొత్త నిబంధన అమల్లోకి తెస్తోంది. క్రికెట్‌లో స్టాపింగ్ క్లాక్ పేరుతో ఈ రూల్ రానుంది. కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తమ తర్వాతి ఓవర్‌లోని తొలి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్‌లలోపే వేయాల్సి ఉంటుంది. లేకపోతే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా విధిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.

SA Vs IND: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇండియా సిరీస్ నుంచే అమలు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్‌ను మరింత రంజుగా మార్చేందుకు కొత్త నిబంధన అమల్లోకి తెస్తోంది. క్రికెట్‌లో స్టాపింగ్ క్లాక్ పేరుతో ఈ రూల్ రానుంది. కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తమ తర్వాతి ఓవర్‌లోని తొలి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్‌లలోపే వేయాల్సి ఉంటుంది. లేకపోతే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా విధిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఆటలో వేగం పెంచడానికే ఈ నిబంధనను అమలులోకి తెస్తున్నట్లు ఐసీసీ వివరించింది. స్టాపింగ్ క్లాక్ నిబంధన డిసెంబర్ 12 నుంచి వైట్ బాల్ క్రికెట్‌లో అమల్లోకి రానుంది. అంటే వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగే టీ20 సిరీస్‌‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య జరిగే రెండో టీ20లో ఈ రూల్‌ను ఐసీసీ అమలు చేయనుంది.

ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ స్టాపింగ్ క్లాక్ నిబంధన డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు అమలవుతుంది. ట్రయల్ రన్ కింద దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ నిబంధనను ఐసీసీ పర్యవేక్షించనుంది. ఎలాంటి లోపాలు లేకపోతే పూర్తి స్థాయిలో ఈ రూల్‌ను ఐసీసీ అమలు చేయనుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ఐసీసీ జనరల్ మేనేజర్ వెల్లడించారు. ఓవర్ల మధ్య కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు, డ్రింక్స్ బ్రేక్ విరామంలో, బ్యాటర్ లేదా ఫీల్డర్‌కు గాయమైన సమయంలో ఈ రూల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T21:55:08+05:30 IST