ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. అలా చేస్తే బౌలర్లకు 5 పరుగులు పెనాల్టీ..!!
ABN , First Publish Date - 2023-11-21T20:19:48+05:30 IST
Cricket News: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ మరో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇటీవల మ్యాచ్‌లు ఆలస్యంగా ముగిస్తున్నాయి. ఓవర్, ఓవర్ మధ్య కొందరు బౌలర్లు లేటు చేస్తుండటంతో సమయం పెరుగుతోంది. దీంతో పురుషుల వన్డే, టీ20 మ్యాచ్‌లలో కొత్త రూల్ అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. బౌలింగ్ జట్టు ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించేందుకు ఓ రూల్ తీసుకొచ్చింది.
క్రికెట్‌లో ఎప్పటికప్పుడు ఐసీసీ కొత్త రూల్స్ తెస్తూ ఆటను మరింత ఉత్తేజంగా మారుస్తోంది. గతంలో నిస్తేజంగా సాగుతున్న ఆటను పవర్ ప్లేలను అమల్లోకి తెచ్చి రంజుగా మార్చింది. అంతేకాకుండా పలు నిబంధనలు అమలు పరుస్తూ ఆట స్వరూపాన్ని ఛేంజ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇటీవల మ్యాచ్‌లు ఆలస్యంగా ముగిస్తున్నాయి. ఓవర్, ఓవర్ మధ్య కొందరు బౌలర్లు లేటు చేస్తుండటంతో సమయం పెరుగుతోంది. దీంతో పురుషుల వన్డే, టీ20 మ్యాచ్‌లలో కొత్త రూల్ అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. బౌలింగ్ జట్టు ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించేందుకు ఓ రూల్ తీసుకొచ్చింది.
కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు 60 సెకన్‌లలోపు ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మ్యాచ్‌లో రెండు సార్ల కంటే ఈ సమయం ఎక్కువగా ఉంటే బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అంటే బ్యాటింగ్ జట్టు స్కోరులో ఈ ఐదు పరుగులు కలవనున్నాయి. అంతేకాకుండా ఇకపై మ్యాచ్‌లో ఓవర్ల మధ్య సమయాన్ని తనిఖీ చేయడానికి మ్యాచ్ అధికారులు దగ్గర స్టాప్ క్లాక్ ఉంటుంది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ ప్రకటించింది. ఈ నిబంధనతో వైట్ బాల్ క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్లు తగ్గుతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.