ODI World Cup 2023: టీమిండియా రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం..!!

ABN , First Publish Date - 2023-10-03T17:06:31+05:30 IST

వన్డే ప్రపంచకప్‌ ముందు టీమిండియా ఆడాల్సిన రెండో వార్మప్ మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

ODI World Cup 2023: టీమిండియా రెండో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం..!!

మెగా టోర్నీలో టీమిండియాను వరుణ గండం వెంటాడుతోంది. దీంతో వన్డే ప్రపంచకప్‌ ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించడం లేదు. వరుసగా రెండో వార్మప్ మ్యాచ్‌ను కూడా వరుణుడు అడ్డుకున్నాడు. ఇప్పటికే గౌహతిలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇప్పుడు తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో ఆడాల్సిన మ్యాచ్ కూడా ఆగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. అయితే ఆ తర్వాత కాసేపు వర్షం తగ్గినా మైదానాన్ని ఆరబెట్టేలోగా మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆట నిర్వహించడం సాధ్యం కాదని తేల్చేశారు. ఈ మేరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-10-03T17:06:31+05:30 IST