Virat Kohli: విరాట్ కోహ్లీ వీర విజృంభణ.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

ABN , First Publish Date - 2023-01-15T17:54:11+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. శ్రీలంక బౌలర్లపై సిక్స్‌లు, ఫోర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 8 సిక్స్‌లు, 13 ఫోర్లతో తుఫానులా..

Virat Kohli: విరాట్ కోహ్లీ వీర విజృంభణ.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

తిరువనంతపురం: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. శ్రీలంక బౌలర్లపై సిక్స్‌లు, ఫోర్లతో సునామీలా విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 8 సిక్స్‌లు, 13 ఫోర్లతో తుఫానులా చెలరేగి 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 97 బంతుల్లో 2 సిక్స్‌లు, 14 ఫోర్లతో 116 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇద్దరి వీర ఉతుకుడుతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక ముందు 391 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 38 పరుగులు చేశారు. రెండు వన్డేల్లో గెలిచి ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఈ వన్డేలో కూడా సత్తా చాటి క్లీన్‌స్వీప్ చేయాలని డిసైడ్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అంచనాలకు తగినట్టుగానే దుమ్ములేపింది. విరాట్ కోహ్లీ వన్డేల్లో 46వ సెంచరీతో అదరగొట్టాడు.

Updated Date - 2023-01-15T18:22:37+05:30 IST