Share News

IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రారంభం ఎప్పుడంటే..?

ABN , Publish Date - Dec 18 , 2023 | 08:52 PM

IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4 నుంచి జూన్ 30 మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందా అంటూ ఆరాలు తీస్తున్నారు. మినీ వేలం మంగళవారం జరగనుండగా.. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 22న లేదా 23న ప్రారంభం అవుతుందని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి.

IPL 2024: వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రారంభం ఎప్పుడంటే..?

వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4 నుంచి జూన్ 30 మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందా అంటూ ఆరాలు తీస్తున్నారు. మినీ వేలం మంగళవారం జరగనుండగా.. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 22న లేదా 23న ప్రారంభం అవుతుందని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. మార్చి 11 వరకు ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత నేరుగా టీ20 ప్రపంచకప్‌లోనే బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ను ఖరారు చేయలేదు.

కాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక ఆటగాళ్లు సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నారు. దీంతో విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయంపై బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు స్పష్టమైన సమాచారాన్ని అందజేసింది. మార్చిలో తండ్రికాబోతున్న ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ లీగ్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడని తెలిపింది. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఐపీఎల్ 2024 సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని, మిగతా ఆటగాళ్లు తమ అంతర్జాతీయ షెడ్యూల్‌కు అనుగుణంగా అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 08:52 PM