IPL Auction: ఐపీఎల్ వేలంలో అందరి దృష్టి మల్లికా సాగర్‌పైనే.. ఎవరామె?
ABN , Publish Date - Dec 18 , 2023 | 07:09 PM
IPL Auction: రేపు దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలం ప్రక్రియలో అందరి దృష్టిని ఓ మహిళ ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు మల్లికా సాగర్. ఎందుకంటే ఈమె తొలి మహిళా ఆక్షనీర్‌గా రికార్డులకెక్కారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ వేలం ప్రక్రియను ముందుండి నడిపించనున్నారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ మరింత రంజుగా సాగనుంది. ఈ మేరకు ఐపీఎల్ మినీ వేలాన్ని ఐపీఎల్ పాలకమండలి దుబాయ్ వేదికగా మంగళవారం నిర్వహించనుంది. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలం ప్రక్రియలో పాల్గొననున్నారు. అయితే ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఓ మహిళ ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు మల్లికా సాగర్. ఎందుకంటే ఈమె తొలి మహిళా ఆక్షనీర్‌గా రికార్డులకెక్కారు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ వేలం ప్రక్రియను ముందుండి నడిపించనున్నారు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నాటి నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ ఆక్షనీర్‌గా వ్యవహరించాడు. 2018 నుంచి గత ఏడాది వరకు హ్యూ ఎడ్మిడ్స్ ఆక్షన్‌ను నడిపిస్తున్నాడు. కానీ గత ఏడాది వేలం మధ్యలోనే అతడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చారు శర్మ ఆ బాధ్యతలను తీసుకున్నాడు.
కాగా ఐపీఎల్ వేలం ప్రక్రియలో పాల్గొన్న తొలి భారతీయుడిగా చారుశర్మ నిలిచాడు. ఈ ఏడాది నుంచి మల్లికా సాగర్ ఐపీఎల్ ఆక్షన్ వ్యవహారాలను ముందుండి నడిపించనుంది. మల్లికా సాగర్‌కు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె స్వస్థలం ముంబై. ఆర్ట్ కలెక్టర్‌గా పనిచేసేవారు. తొలుత ఆమె ఉండోల్ ఆర్ట్ గ్యాలరీలో వేలం నిర్వహించేవారు. వేలం ప్రక్రియలో ఆమె దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. అందుకే ఆమెకు బీసీసీఐ కీలక బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా గతంలో మహిళల ఐపీఎల్‌కు కూడా ఆక్షనీర్‌గా పనిచేసింది. 2001 నుంచి ప్రొ.కబడ్డీ లీగ్‌కు కూడా మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.