Share News

ODI World Cup: టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుంది..!!

ABN , First Publish Date - 2023-11-09T22:07:56+05:30 IST

Team India: ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా నుంచి మొన్న దక్షిణాఫ్రికా వరకు అన్ని జట్లను ఓడించింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశాలు ఉన్నాయి. మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుందని వాన్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ODI World Cup: టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుంది..!!

వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌లో తలపడనున్నాయి. మరో బెర్త్ కోసం న్యూజిలాండ్ లేదా పాకిస్థాన్ పోటీపడుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా నుంచి మొన్న దక్షిణాఫ్రికా వరకు అన్ని జట్లను ఓడించింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ మాత్రం ఫైనల్ ఎవరి మధ్య జరుగుతుందో జోస్యం చెప్పాడు. మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ ఎవరితో ఆడిందో ఆఖరి మ్యాచ్ వాళ్లతోనే ఆడుతుందని వాన్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఫైనల్లో టీమిండియా ఓడిపోతుందని.. ఆస్ట్రేలియా గెలుస్తుందని మైఖేల్ వాన్ చెప్పాడు. ఫైనల్లో టీమిండియాను ఆస్ట్రేలియా చాలా ఈజీగా ఓడిస్తుందని అన్నాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయినప్పుడు తన కో కామెంటేటర్ వసీం జాఫర్‌కు మంచి గిఫ్ట్ ఇస్తానని.. ఇప్పటికే ఆ గిఫ్ట్‌ను రెడీగా పెట్టుకున్నట్లు వివరించాడు. వసీం జాఫర్, వాన్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తుంది. వీళ్లిద్దరూ ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం ప్రతిసారీ ఫ్యాన్స్‌కు సరదాగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి జాఫర్‌ను కవ్వించడానికి టీమిండియా ఓడిపోతుందని వాన్ చెప్పినట్లు అభిమానులు భావిస్తున్నారు. కాగా 2023 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను టీమిండియా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడగా.. లక్ష్యఛేదనలో తడబడింది. కోహ్లీ, రాహుల్ రాణించడంతో చివరకు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated Date - 2023-11-09T22:07:58+05:30 IST