Share News

Rohit Sharma: రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ వీడియో.. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై స్పందన

ABN , First Publish Date - 2023-12-13T15:46:55+05:30 IST

Rohit Sharma: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ హార్ట్ బ్రేకింగ్ వీడియో.. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై స్పందన

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో క్రికెట్ అభిమానులను టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌లకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. ఈ బాధ నుంచి బయటపడేందుకు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సహాయపడ్డారని రోహిత్ వివరించాడు.

మరోవైపు టీమిండియా అభిమానులను చూస్తే తనకు చాలా బాధ కలిగిందని రోహిత్ అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజం అని.. గెలుపు వచ్చినా.. ఓటమి ఎదురైనా జీవితంలో ముందుకు సాగాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమిని మరిచిపోయేందుకు తాను ఎక్కడికైనా వెళ్లాలనుకున్నానని.. కానీ చాలా కష్టంగా అనిపించిందని రోహిత్ చెప్పాడు. ప్రపంచకప్ గెలిచేందుకు తాము ఎంతో కష్టపడ్డామని.. కొన్ని నెలలుగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగామని.. కానీ అది సాధించలేకపోయినందుకు బాధగా ఉందన్నాడు. తాము ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచామని.. కానీ ఆ మ్యాచ్‌లలో తప్పులు ఉన్నాయని ఎవరైనా తనను అడిగితే తాము చేయాల్సిందంతా చేశామని చెప్తామన్నాడు. ప్రతి గేమ్‌లో పొరపాట్లు జరుగుతుంటాయని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాల్సి ఉంటుందన్నాడు. ఆటలో గెలిచినా.. ఓడినా ఎవరూ పరిపూర్ణులు కాలేరన్నాడు. జట్టుగా తమ ప్రదర్శనపై తాను చాలా గర్విస్తున్నానని.. ఫైనల్లో గెలిస్తే తమ ప్రదర్శనపై మరింత సంతృప్తిగా ఉండేదని రోహిత్ తెలిపాడు. ప్రపంచకప్ గెలిచి ఉంటే తాము ఎక్కడికెళ్లినా ఆకాశానికి ఎత్తేసేవాళ్లని.. దురదృష్టవశాత్తూ అది జరగలేదన్నాడు. ప్రపంచకప్‌లో అభిమానుల నుంచి తమకు ఎంతో మద్దతు లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T15:50:00+05:30 IST