Share News

Team India: ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్ కొట్టిన టీమిండియా ఆటగాడు

ABN , First Publish Date - 2023-11-02T21:16:21+05:30 IST

శ్రీలంకతో ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదడమే కాకుండా ఈ ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు.

Team India: ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్ కొట్టిన టీమిండియా ఆటగాడు

వన్డే ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. స్టార్ ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగిపోతున్నారు. సిక్సర్లతో మైదానాలను హోరెత్తిస్తున్నారు. శ్రీలంకతో ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదడమే కాకుండా ఈ ప్రపంచకప్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా కాసున్ రజిత వేసిన 36వ ఓవర్‌లో నాలుగో బంతిని శ్రేయాస్ అయ్యర్ లాంగాన్ మీదుగా 106 మీటర్ల సిక్స్ బాదాడు. దీంతో మ్యాక్స్‌వెల్ నెలకొల్పిన రికార్డును అతడు అధిగమించాడు.

ఈ మ్యాచ్ ముందు వరకు పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అయ్యర్.. శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే బ్యాటింగ్‌తో సమాధానం చెప్పాడు. షార్ట్ పిచ్ బాల్ బలహీనతను అధిగమిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ న్యూజిలాండ్‌పై 104 మీటర్ల సిక్సర్ బాదాడు. దీంతో ఇప్పటివరకు ఇదే భారీ సిక్సర్‌గా ఉంది. ఇప్పుడు ఈ ఫీట్‌ను శ్రేయాస్ అయ్యర్ అధిమించాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో కూడా అయ్యరే ఉన్నాడు. ఈ టోర్నీలో భారీ సిక్సర్ల జాబితాను పరిశీలిస్తే.. అయ్యర్(106 మీటర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాక్స్‌వెల్(104 మీటర్లు), శ్రేయస్ అయ్యర్ (101 మీటర్లు), ఫకార్ జమాన్(99 మీటర్లు), డేవిడ్ వార్నర్(98 మీటర్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Updated Date - 2023-11-02T21:16:22+05:30 IST