SA Vs AUS Semi Final: డేవిడ్ మిల్లర్ సెంచరీ.. 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆలౌట్
ABN , First Publish Date - 2023-11-16T18:53:14+05:30 IST
ODI World Cup 2nd Semi Final: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చప్పగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. మిల్లర్, క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చప్పగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్లాసెన్ (47), మిల్లర్ (101) ఆదుకోవడంతో దక్షిణాఫ్రికా కోలుకున్నట్లే కనిపించింది. కానీ క్లాసెన్ ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మిల్లర్‌కు సహకారం ఇచ్చేవాళ్లు లేకపోవడంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.
కాగా ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టారు. జాష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆడమ్ జంపా ఈ మ్యాచ్‌లో వికెట్లేమీ సాధించలేకపోయాడు. సెమీస్ అంటే అనవసరంగా ఒత్తిడికి గురయ్యే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ అదే తడబాటును కొనసాగించింది. దీంతో సఫారీలకు చోకర్స్ అనే మాట సరిగ్గా సరిపోతుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. 1999 ప్రపంచకప్ సెమీస్‌లో ఫలితాన్ని ఆస్ట్రేలియా రిపీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.