ODI World Cup: సెంచరీతో చెలరేగిన డికాక్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
ABN , First Publish Date - 2023-10-12T18:03:50+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో మరోసారి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. శ్రీలంకపై 428 పరుగులు చేసిన సఫారీ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా మంచి స్కోరు సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో మరోసారి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. శ్రీలంకపై 428 పరుగులు చేసిన సఫారీ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా మంచి స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 311 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. 106 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. మార్‌క్రమ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే చివర్లో దక్షిణాఫ్రికా అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌల్ చేశాడు. మార్కో జాన్సన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు సాధించడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 311 పరుగులకే పరిమితమైంది. ః
ఇది కూడా చదవండి: World cup: విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ కౌగిలింతపై గంభీర్ ఏమన్నాడో తెలుసా?..
కాగా ఈ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. వాళ్లు చాలా క్యాచ్‌లను నేలపాలు చేశారు. లేకపోతే దక్షిణాఫ్రికా 300 లోపు స్కోరు మాత్రమే చేయగలిగేది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు సాధించారు. జాష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియా 312 పరుగులు చేయాలి. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిన ఆస్ట్రేలియా ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కీలకంగా మారింది.