SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్
ABN , First Publish Date - 2023-10-21T18:20:03+05:30 IST
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
ముంబైలోని వాంఖడే వేదికగా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 75 బాల్స్‌లో 85, వాండర్ డుస్సెన్ 61 బాల్స్‌లో 61, మార్‌క్రమ్ 44 బాల్స్‌లో 42 పరుగులతో రాణించారు. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం సెంచరీతో రెచ్చిపోయాడు. 67 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి దుమ్మురేపాడు. అతడికి మార్కో జాన్సన్ కూడా జతకలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మిల్లర్ అవుటయ్యే సమయానికి 36.3 ఓవర్లలో 243 పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికా చివరి 14 ఓవర్లలో దాదాపు 150 పరుగులు చేసిందంటే క్లాసెన్-జాన్సన్ జోడీ ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: World Cup: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ దూరం!
మార్కో జాన్సన్ 42 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. క్లాసెన్ అవుటైనా జాన్సన్ మాత్రం భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టోప్లీ 3 వికెట్లు పడగొట్టగా.. యాట్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడగా.. దక్షిణాఫ్రికా 2 విజయాలు సాధించగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఈ రెండు జట్లకు చిన్న జట్లు షాకులు ఇచ్చాయి. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా.. ఆప్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ చావుదెబ్బ తిన్నాయి. అటు ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది జులైలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన అతడిని ఇంగ్లండ్ బోర్డు వెనక్కి పిలిపించి వరల్డ్ కప్‌కు ఎంపిక చేసింది. అయితే గాయం కారణంగా ప్రపంచకప్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.