NZ Vs SL: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్
ABN , First Publish Date - 2023-11-09T17:53:38+05:30 IST
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.
వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు. తొలుత టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సౌథీ శ్రీలంక వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఓపెనర్ పాథుమ్ నిశాంక 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీతో రాణించినా మరో బ్యాటర్ నుంచి సహకారం అందలేదు. దీంతో 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. బౌలర్ మహీష్ తీక్షణ (38) రాణించకపోయి ఉంటే ఆ జట్టు పరిస్థితి ఘోరంగా ఉండేది.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫెర్గుసన్, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర తలో రెండు వికెట్లు సాధించారు. సౌథీ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌పై రెండు జట్ల సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే.. పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు ఉంటాయి. అదే న్యూజిలాండ్ విజయం సాధిస్తే ఆ జట్టు సెమీస్ చేరడం దాదాపు ఖాయమవుతుంది. దీంతో ఈ మ్యాచ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరిగి తీరాలి. బెంగళూరు లాంటి బ్యాటింగ్ వికెట్‌పై న్యూజిలాండ్ 172 పరుగులు కచ్చితంగా సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు విశ్వాసంతో కనిపిస్తున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.