Home » India vs New Zealand
అదే చెత్త బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.
నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు ఆట మొదలైంది.
ముంబై టెస్టులో రెండవ రోజు భారత్ ఆధిపత్యం కొనసాగడంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. భారత్ లక్ష్యం 150 పరుగుల కంటే ఎక్కువగా ఉండకూడదన్న లక్ష్యంగా బౌలింగ్ చేశారు. అనుకున్నట్టే ఇద్దరూ రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో జడేజా ఓ రికార్డు సాధించాడు.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఇలా ఉన్నాయి.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేయాలని పర్యాటక జట్టు కివీస్ ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే టీమిండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు పడుతుంది. వివరాలు ఇవే
పుణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టు తొలి రోజున భారత స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మ్యాజికల్ స్పెల్ వేసి పర్యాటక జట్టు న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. దీంతో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు.
భారత్‌లో టెస్ట్ సిరీస్ మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్ ప్రకటనలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాస్త సృజనాత్మకత జోడించింది. భారత మ్యాప్‌పై మ్యాచ్ వేదికలను చూపించే ప్రయత్నం చేసింది. అయితే సరైన మ్యాప్‌ను తీసుకోకపోవడంతో కివీస్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తదుపరి రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది.
దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి సొంత గడ్డపై కివీస్ చేతిలో టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా ఉంది. ఇక భారత్ టెస్ట్ జట్టు రెగ్యులర్ నంబర్ త్రీ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ లేకపోవడం కూడా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది.