Asia Cup 2023: టీమిండియాను వణికించిన స్పిన్నర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-09-12T19:37:33+05:30 IST

ఆసియా కప్‌లో కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరగులు చేసిన బ్యాటర్లు ఆ తర్వాత తడబాటుకు గురయ్యారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లకు దాసోహం అయ్యారు.

 Asia Cup 2023: టీమిండియాను వణికించిన స్పిన్నర్లు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ఆసియా కప్‌లో కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరగులు చేసిన బ్యాటర్లు ఆ తర్వాత తడబాటుకు గురయ్యారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లకు దాసోహం అయ్యారు. 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో శ్రీలంక ముందు 214 పరుగుల టార్గెట్ నిలిచింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఇది కూడా చదవండి: Shreyas Iyer: వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు టెన్షన్ టెన్షన్.. గాయం నుంచి ఇంకా కోలుకోని స్టార్ ప్లేయర్!

శ్రీలంక యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో సత్తా చాటాడు. తొలి ఆరు వికెట్లలో ఐదు వికెట్లను అతడే పడగొట్టాడు. 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన టీమిండియాను వెల్లలాగే అతలాకుతలం చేశాడు. గిల్, కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య వికెట్లను వెల్లలాగే సాధించాడు. అసలంక 4 వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య (5), రవీంద్ర జడేజా (4) విఫలమయ్యారు.

కాగా 2003లో కొలంబోలో జన్మించిన దునిత్ వెల్లలాగే సెయింట్ జోసెఫ్ కాలేజీలో విద్యను పూర్తి చేశాడు. గతేడాది పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్ట్ పాకిస్థాన్‌తో ఆడిన వెల్లలాగే.. మూడు ఫార్మాట్లలో కలిసి 16 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-09-12T19:39:08+05:30 IST