Share News

KL Rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే మైదానంలో రెండు సెంచరీలు

ABN , Publish Date - Dec 27 , 2023 | 04:17 PM

KL Rahul: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.

KL Rahul: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే మైదానంలో రెండు సెంచరీలు

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఇతర బ్యాటర్లు హాఫ్ సెంచరీ కూడా చేయలేని చోట మెరుపు శతకం సాధించాడు. ముఖ్యంగా రెండో రోజు ఉదయం సెషన్‌లో కేఎల్ రాహుల్ టీ20 తరహా ఆట ఆడాడు. 137 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యషస్వీ జైశ్వాల్ (17), రోహిత్ శర్మ (5), శుభ్‌మన్ గిల్ (2) తీవ్రంగా నిరాశపరిచారు. కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31) ఫర్వాలేదనిపించారు. అశ్విన్ (8), శార్దూల్ ఠాకూర్ (24) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక ఇబ్బంది పడ్డారు. అయితే కేఎల్ రాహుల్ ఒక్కడే సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. టీమిండియా కనీసం 200 పరుగులైనా సాధిస్తుందా అని సందేహం వ్యక్తం చేసిన చోట కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఇది 8వ సెంచరీ. అతడి కారణంగా టీమిండియా 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 04:31 PM