Jio Cinema: స్టార్ గ్రూప్‌కు జియో సినిమా షాక్.. ఇకపై ప్రసార హక్కులు జియోవే..!!

ABN , First Publish Date - 2023-08-31T19:52:42+05:30 IST

వచ్చే ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కుల కోసం వేలం నిర్వహించగా డిస్నీ హాట్‌స్టార్, సోనీ సంస్థలతో పాటు వయాకామ్ 18 పోటీ పడింది. ఈ వేలంలో మిగతా కంపెనీలతో పోలిస్తే ఎక్కువ బిడ్ చేసిన వయాకామ్ 18 సంస్థ సుమారు రూ.6వేల కోట్లకు బీసీసీఐ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై సొంతగడ్డపై టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ టీవీలో అయితే స్పోర్ట్ 18, స్పోర్ట్ 18 ఖేల్ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. అదే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమాలో వస్తుంది.

Jio Cinema: స్టార్ గ్రూప్‌కు జియో సినిమా షాక్.. ఇకపై ప్రసార హక్కులు జియోవే..!!

ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ హక్కులను విజయవంతంగా ప్రసారం చేసిన జియో సినిమా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బీసీసీఐ మీడియా హక్కుల విషయంలో స్టార్ గ్రూప్‌కు రిలయన్స్ ఆధ్వర్యంలోని వయాకామ్ 18 షాక్ ఇచ్చింది. 2023-2028 కాలానికి బీసీసీఐ మీడియా హక్కులను భారీ రేటుకు కైవసం చేసుకుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో టీమిండియా ఆడే హోం మ్యాచ్‌లను వయాకామ్ 18 ప్రసారం చేయనుంది. డిజిటల్, టెలివిజన్ రెండింటికీ సంబంధించిన బ్రాడ్‌కాస్ట్ హక్కులను వయాకామ్ 18 సంస్థ తన ఖాతాలో వేసుకోవడం గమనించాల్సిన విషయం.

viacom 18.jpg

వచ్చే ఐదేళ్ల కాలానికి బీసీసీఐ మీడియా హక్కుల కోసం వేలం నిర్వహించగా డిస్నీ హాట్‌స్టార్, సోనీ సంస్థలతో పాటు వయాకామ్ 18 పోటీ పడింది. ఈ వేలంలో మిగతా కంపెనీలతో పోలిస్తే ఎక్కువ బిడ్ చేసిన వయాకామ్ 18 సంస్థ సుమారు రూ.6వేల కోట్లకు బీసీసీఐ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై సొంతగడ్డపై టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లన్నీ టీవీలో అయితే స్పోర్ట్ 18, స్పోర్ట్ 18 ఖేల్ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. అదే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే జియో సినిమాలో వస్తుంది. ఈ మేరకు ఆసియా కప్ తర్వాత వన్డే ప్రపంచకప్‌కు ముందు సెప్టెంబర్‌లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న మూడు వన్డేల సిరీస్‌ను వయాకామ్ 18 ప్రసారం చేయనుంది. సెప్టెంబర్ 22న తొలి వన్డే, 24న రెండో వన్డే, 27న మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం నవంబరులోనే ఆస్ట్రేలియాతో ఆడనున్న ఐదు టీ20ల సిరీస్‌ కూడా వయాకామ్ 18 ప్రసారం చేయనుంది. నవంబర్ 23న తొలి టీ20, 26న రెండో టీ20, 28న మూడో టీ20, డిసెంబర్ 1న నాలుగో టీ20, డిసెంబర్ 3న ఐదో టీ20 జరుగుతాయి.

ఇది కూడా చదవండి: Team India: హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్


కాగా 2023-2028 ఐదేళ్ల కాలంలో మొత్తం భారత్‌లో 88 మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ అంచనా వేస్తోంది. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత ఐదేళ్లుగా సొంతగడ్డపై భారత్ ఆడే మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తోంది. అయితే వచ్చే ఐదేళ్ల కాలానికి మాత్రం ఈ హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోలేకపోయింది. 2018లో టీవీ, డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.6138 కోట్లను ఖర్చు చేసి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది.

Updated Date - 2023-08-31T19:52:42+05:30 IST