Wasim Akram: టీమిండియాపై వసీం అక్రమ్ విమర్శలు.. ఈసారి కూడా ఫైనల్ చేరలేదు
ABN , First Publish Date - 2023-08-29T13:13:32+05:30 IST
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టీమిండియాపై విమర్శలు చేశాడు. గత ఏడాది భారత్ ఆసియా కప్‌లో ఫైనల్‌కు కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత్ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపాడు. ఈ ఏడాది కూడా టీమిండియా ఫైనల్ చేరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ బుధవారం నుంచే ఆసియా కప్ 2023 ప్రారంభం కాబోతోంది. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమిండియా, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్ జట్లు కూడా ఆసియా కప్‌లో తలపడుతున్నాయి. అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు స్పాన్సర్లు ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. అతడు 1984 నుంచి 2003 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడి పేస్ బౌలర్‌గా రాణించాడు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 2న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి వసీం అక్రమ్‌ను జర్నలిస్టులు కొన్ని ప్రశ్నలు అడిగారు. కొందరు ఈ మ్యాచ్‌ను మదర్ ఆఫ్ ది బ్యాటిల్ అని అభివర్ణించారు. ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యత మిగతా మ్యాచ్‌లకు ఉండదు కదా అని పలువురు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: వదిలిపెట్టని ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీని తిట్టిన మ్యాంగో మేన్ ఎక్కడ?
అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టీమిండియాపై విమర్శలు చేశాడు. గత ఏడాది భారత్ ఆసియా కప్‌లో ఫైనల్‌కు కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత్ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపాడు. గత ఏడాది ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడతాయని ఊహించామని.. కానీ అనూహ్యంగా మధ్యలో శ్రీలంక అద్భుత ప్రదర్శన చేసిందని వసీం అక్రమ్ గుర్తుచేశాడు. ఈ ఏడాది కూడా టీమిండియా ఫైనల్ చేరలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ రోజు ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే ఫైనల్ చేరుతుందన్నాడు. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్‌లో పర్యటించలేని టీమిండియాపై పీసీబీ వైఖరి ఎలా ఉందని మరో విలేకరి ప్రశ్నించాడు. అయితే టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించే విషయం రాజకీయాలతో ముడిపడి ఉందని.. కానీ క్రీడలు, రాజకీయాలను వేరుగా ఉంచాలని వసీం అక్రమ్ స్పష్టం చేశాడు. త్వరలోనే భారత్, పాకిస్థాన్ మధ్య రెగ్యులర్ సిరీస్‌లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసియా కప్‌లో మ్యాచ్‌లను వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ వెళ్లనున్నారు.