WPL 2023: ఓడిన ఆర్సీబీ.. టాప్ ప్లేస్‌లోకి ముంబై
ABN , First Publish Date - 2023-03-21T19:05:28+05:30 IST
వరుస ఓటములకు అలవాటు పడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబైతో జరిగిన 8వ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. డాక్టర్ డీవీ పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో
నవీ ముంబై: వరుస ఓటములకు అలవాటు పడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబైతో జరిగిన 8వ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. డాక్టర్ డీవీ పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
బెంగళూరు నిర్దేశించిన 126 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అమెలియా కెర్ 31 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా, యస్తికా భాటియా 30, హేలీ మాథ్యూస్ 24, పూజా వస్త్రాకర్ 19 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కనిక అహుజ రెండు వికెట్లు పడగొట్టింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్ల ముందు బెంగళూరు బ్యాటర్ల ఆటలు సాగలేదు. వరుస వికెట్లు తీస్తూ బెంగళూరు(RCBW)ను కోలుకోలేకుండా చేశారు. ఫలితంగా ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్ చేరారు. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ చెరో 29 పరుగులు చేశారు. కెప్టెన్ స్మృతి మంధాన 24 పరుగులు చేసింది. హెదర్ నైట్, కనిక అహుజ చెరో 12 పరుగులు చేశారు. ముంబై(MIW) బౌలర్లలో అమెలియా కెర్ 3 వికెట్లు తీసుకోగా, నట్ స్కివర్ బ్రంట్, ఇసీ వోంగ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.