WPL 2023: చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ఎదుట స్వల్ప లక్ష్యం

ABN , First Publish Date - 2023-03-09T21:18:53+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL 2023)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరుగుతున్న

WPL 2023: చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ఎదుట స్వల్ప లక్ష్యం

నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL 2023)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై బౌలర్ల నిప్పులు చెరిగే బంతులకు బ్యాటర్లు క్రమం తప్పకుండా పెవిలియన్ చేరారు. ఫలితంగా మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 105 పరుగులకు కుప్పకూలింది.

ముంబై బౌలర్లు సైకా ఇషాక్, ఇసీ వోంగ్, హేలీ మాథ్యూస్ పోటీలు పడి తలా మూడు వికెట్లు పడగొట్టారు. సైకా ఇషాక్ మూడు ఓవర్లు వేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి బెస్ట్ నమోదు చేసింది. ఇక, ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ లానింగ్(Meg Lanning) మాత్రమే ఒంటరి పోరు చేసి 43 పరుగులు చేసింది. జట్టులో ఇదే టాప్ స్కోర్. ఆ తర్వాత రోడ్రిగ్స్ చేసిన 25 పరుగులు రెండో అత్యధికం. రాధా యాదవ్ 10 పరుగులు చేసింది. మిగతా వారిలో ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ దాటలేదు.

Updated Date - 2023-03-09T21:18:53+05:30 IST