ECB: మహిళా క్రికెటర్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. వారి మ్యాచ్ ఫీజులను ఏకంగా..

ABN , First Publish Date - 2023-08-30T21:11:21+05:30 IST

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ECB: మహిళా క్రికెటర్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. వారి మ్యాచ్ ఫీజులను ఏకంగా..

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ వేతనాలు ఈ వారంలో శ్రీలంకతో జరబోయే సిరీస్ నుంచే అమలులోకి రానున్నాయి. ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన యాషెస్ సిరీస్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 1,10,000 మంది ప్రేక్షకులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ‘ఇది మహిళల క్రికెట్ చరిత్రలో అత్యుత్తమమైనది" అని ప్రకటించింది. ఇది ఒక మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఎడ్జ్‌బాస్టన్, కియా ఓవల్, లార్డ్స్ మైదానాలలో కూడా ఆస్ట్రేలియాలతో జరిగిన మ్యాచ్‌లకు ప్రేక్షకులు రికార్డు స్థాయిలో హాజరయ్యారు. టాంటన్, బ్రిస్టల్, హాంప్‌షైర్‌లలో జరిగిన మ్యాచ్‌లకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మహిళా క్రికెటర్లకు ఆదరణ పెరగడాన్ని ఈసీబీ గమనించింది. దీంతో తమ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను ఒకసారిగా పెంచేసింది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు కూడా మ్యాచ్ ఫీజులు చెల్లించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమంగా వేతనం ఇవ్వనున్న బోర్డుగా ఈసీబీ నిలవనుంది. కాగా ఇతర ఏ క్రికెట్ టీంలో కూడా పురుష క్రికెటర్లకు సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు లేవనే సంగతి తెలిసిందే. పురుష క్రికెటర్లతో పోల్చుకుంటే మహిళా క్రికెటర్లకు తక్కువ వేతనాలున్నాయి.

Updated Date - 2023-08-30T21:11:21+05:30 IST