IPL 2024: హార్దిక్ పాండ్యా బాటలోనే మహ్మద్ షమీ? గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పదా?..
ABN , First Publish Date - 2023-12-07T12:34:10+05:30 IST
Gujarat Titans: ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ ఆటగాడు కూడా చేరినట్టుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ ఆటగాడు కూడా చేరినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా జట్టును వీడే అవకాశాలున్నాయి. ఇప్పటికే షమీని ఓ ఫ్రాంచైజీ సంప్రదించిందంట. గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అరవింద్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు. ఓ ఫ్రాంచైజీ తమ ప్రముఖ వికెట్ టేకర్ మహ్మద్ షమీని సంప్రదించినట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. అదే జరిగితే గుజరాత్ టైటాన్స్‌కు మరో షాక్ తప్పకపోవచ్చు.
‘
‘ప్రతి ఫ్రాంచైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం వెళ్లే హక్కు ఉంటుంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ నేరుగా ఒక ఆటగాడిని సంప్రదించినట్లయితే అది తప్పు. ఈ పద్దతి తప్పు. గుజరాత్ టైటాన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ఈ విధానం పట్ల సంతోషంగా లేదు. ప్లేయర్ ట్రేడింగ్‌కు సంబంధించి బీసీసీఐ నియమాలున్నాయి. వారి ఆసక్తి గురించి బీసీసీఐకి చెబితే వారు మాకు తెలియచేస్తారు. అప్పుడు ట్రేడింగ్‌కు సంబంధించి ఫ్రాంచైజీ నిర్ణయిస్తుంది. ఈ ఐపీఎల్ టీమ్ నేరుగా మా కోచింగ్ స్టాఫ్‌ను సంప్రదించిన విధానం తప్పు. బదిలీ కావాలంటే మాతో ముందుగానే మాట్లాడి ఉండేవారు. కానీ మేము తర్వాత దాని గురించి తెలుసుకున్నాం.’’ అని అన్నాడు. అయితే ఆ ఫ్రాంచైజీ ఏదనే విషయాన్ని అరవింద్ సింగ్ బయటపెట్టలేదు. అలాగే మహ్మద్ షమీ ఫ్రాంచైజీ మారతాడా? లేదా? అనేది తెలియాలంటే మరో 4, 5 రోజులు ఎదురుచూడాల్సిందే. నిజానికి ఐపీఎల్ 2024కి ముందు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకునే గడువు ముగిసింది. కానీ ట్రేడింగ్ గడువు ఇంకా ఉంది. ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరికొన్ని ట్రేడింగ్స్ జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక ఆటగాళ్ల రిటైన్షన్ జాబితా గడువుకు ముందు ఈ సీజన్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది. ఈ పరిణామం ఐపీఎల్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.