IND vs WI: చరిత్రకు రెండు అడుగుల దూరంలో హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలోనే రెండో ఆల్‌రౌండర్‌గా..

ABN , First Publish Date - 2023-08-03T17:55:45+05:30 IST

భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు.

IND vs WI: చరిత్రకు రెండు అడుగుల దూరంలో హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలోనే రెండో ఆల్‌రౌండర్‌గా..

ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరొక 2 వికెట్లు తీస్తే అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. మరోవైపు హార్దిక్ ఇప్పటికే టీ20ల్లో 4 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ ఆల్‌రౌండర్‌గా అన్ని రకాల టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 4348 పరుగులు, 148 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో మరో 2 వికెట్లు తీస్తే టీ20ల్లో 150 వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన మొదటి భారత ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టిస్తాడు. మొత్తంగా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పుతాడు. దీంతో హార్దిక్ పాండ్యా చరిత్రకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు.


ఇక ఇప్పటికే వన్డే, టెస్టు సిరీస్‌లు గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. టీ20 సిరీస్‌ను కూడా గెలిచి విండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించాలని భావిస్తోంది. యువకులతో కూడిన భారత్ జట్టును హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. మరోవైపు వెస్టిండీస్ మాత్రం పరువు కోసం ఆరాటపడుతోంది. ఇప్పటికే సొంత గడ్డపై వన్డే, టెస్టు సిరీస్‌లు ఓడిన నిరాశలో ఉన్న కరేబియన్లు.. టీ20 సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్ 11 క్రింది విధంగా ఉండే అవకాశాలున్నాయి.

భారత్‌:

జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌/శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), గిల్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, చాహల్‌/బిష్ణోయ్‌, ఉమ్రాన్‌/అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌.

వెస్టిండీస్‌:

బ్రండన్‌ కింగ్‌, మేయర్స్‌, జాన్సన్‌ చార్లెస్/హోప్‌ (వికెట్‌ కీపర్‌), పూరన్‌, హెట్‌మయెర్‌, రోవ్‌మన్‌ పావెల్‌ (కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, హోల్డర్‌, షెఫర్డ్‌/ఓడెన్‌ స్మిత్‌, అకిల్‌ హొస్సేన్‌, జోసెఫ్/ఓషేన్‌ థామస్‌.

Updated Date - 2023-08-03T17:56:40+05:30 IST