Odi World cup: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?..
ABN , First Publish Date - 2023-06-27T12:40:14+05:30 IST
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ప్రారంభ మ్యాచ్‌లో గత ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 12న పుణె వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో లీగ్ స్టేజ్ ముగియనుంది. ప్రతి జట్టు లీగ్ స్టేజ్‌లో 9 మ్యాచ్‌ల చొప్పున ఆడనున్నాయి. నవంబర్ 15న ముంబైలో మొదటి సెమీఫైనల్, 16న కోల్‌కతాలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 19న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది.
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?..
ఇక ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నైచెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక టోర్నీలోనే అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ పోరు జరగనుంది. భారత్ జట్టు ఆడే పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో, అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలో, 15న పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో, 19న బంగ్లదేశ్‌తో పుణేలో, 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో, 29న ఇంగ్లండ్‌తో లక్నోలో, నవంబర్ 2న క్వాలిఫైయర్ జట్టుతో ముంబైలో, 5న సౌతాఫ్రికాతో కోల్‌కతాలో, 11న క్వాలిఫైయర్ జట్టుతో బెంగళూరులో భారత జట్టు తలపడనుంది.