Share News

IND vs AUS: మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియాలో కీలక మార్పులు.. స్వదేశానికి ఆరుగురు ఆటగాళ్లు

ABN , First Publish Date - 2023-11-28T13:43:23+05:30 IST

భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.

IND vs AUS: మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియాలో కీలక మార్పులు.. స్వదేశానికి ఆరుగురు ఆటగాళ్లు

గువాహటి: భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. తమ సిరీస్ విజయ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా తమ జట్టులో కీలకమార్పులు చేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 మార్పులు చేసింది. పని భారం కారణంగా వారికి విశ్రాంతినిచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. మరో నలుగురు ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, జోష్ ఇంగ్లీస్, సీన్ అబాట్ కూడా మూడో టీ20 మ్యాచ్ అనంతరం బుధవారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. మూడో టీ20 సమయంలో వీరు నలుగురు ఇండియాలోనే ఉంటున్నప్పటికీ వారు మ్యాచ్ ఆడరు.


స్వదేశానికి వెళ్లిన స్మిత్, జంపా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్స్, బిగ్ హిట్టర్ అయిన్ బెన్ మెక్‌డెర్మాట్ జట్టులో చేరారు. ఇక రాయ్‌పూర్‌లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు బెన్ ద్వార్షుయిస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ జట్టులో చేరనున్నారు. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్తున్నప్పటికీ వారి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నలుగురిని మాత్రమే జట్టులోకి తీసుకుంది. కాగా భారత జట్టులో కూడా మూడో టీ20 మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ చేరనున్నాడు.

మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టు

మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టీమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్

Updated Date - 2023-11-28T13:43:32+05:30 IST