IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

ABN , First Publish Date - 2023-07-24T15:43:06+05:30 IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర స‌ృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.

IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే, భజ్జీ రికార్డులు బద్దలు

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర స‌ృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ (Harbhajan Singh) రికార్డును (Record) అశ్విన్ బద్దలుకొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి హర్బజన్ సింగ్ 711 వికెట్లు తీయగా.. 712 వికెట్లతో భజ్జీని అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో 956 వికెట్లతో అనిల్ కుంబ్లే (Anil Kumble) మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా టెస్టు ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా కూడా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. విండీస్‌పై కుంబ్లే 74 వికెట్లు పడగొట్టగా.. 75 వికెట్లతో అశ్విన్ అతన్ని అధిగమించాడు. మొత్తంగా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కపిల్ దేవ్(Kapil Dev) ఖాతాలో 89 వికెట్లు ఉన్నాయి. ఇక తన కెరీర్లో ఇప్పటివరకు 94 టెస్టులు ఆడిన అశ్విన్ 489 వికెట్లు, 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు.


ఇక భారత్ విసిరిన 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో చందర్‌పాల్(24), బ్లాక్‌వుడ్(20) ఉన్నారు. విండీస్ గెలవాలంటే మరో 289 పరుగులు చేయాలి. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో చివరిదైన ఐదో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ధాటిగా బ్యాటింగ్ చేసింది. 7కు పైగా రన్‌రేటుతో 24 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(Rohit Sharma), ఇషాన్ కిషన్(Ishan Kishan) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ 44 బంతుల్లోనే 57 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 34 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 438 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 255 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-24T15:43:06+05:30 IST