Mohammed Siraj: గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో.. సిరాజ్ అద్భుత ఫీల్డింగ్ చూడాల్సిందే!.. వీడియో ఇదిగో..

ABN , First Publish Date - 2023-07-13T12:09:39+05:30 IST

భారత్, వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ అందుకున్న ఓ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ చివరి బంతిని వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్ ‌వుడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో బంతి మైదానంలోనే గాల్లోకి లేచింది.

Mohammed Siraj: గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో.. సిరాజ్ అద్భుత ఫీల్డింగ్ చూడాల్సిందే!.. వీడియో ఇదిగో..

డొమినికా: భారత్, వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ అందుకున్న ఓ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ చివరి బంతిని వెస్టిండీస్ బ్యాటర్ బ్లాక్ ‌వుడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా టైమింగ్ కుదరకపోవడంతో బంతి మైదానంలోనే గాల్లోకి లేచింది. అయితే బంతి కిందపడే ప్రదేశంలో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో బంతి బౌండరీ వెళ్తుందేమే అనుకున్నారంతా. అయితే అక్కడికి దగ్గర్లో ఉన్న మహ్మద్ సిరాజ్ కుడి వైపునకు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి, గాల్లోకి ఎగిరి, ఒకే చేయ్యితో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ అద్భుత ఫీల్డింగ్‌తో బ్లాక్‌వుడ్ ఇన్నింగ్స్ 14 పరుగులకే ముగిసింది. సిరాజ్ అద్భుత ఫీల్డింగ్‌ను సహచర ఆటగాళ్లు అభినందించారు. క్యాచ్ అందుకున్న తర్వాత సిరాజ్ కాసేపు అలాగే ఉండి పోయి, మోచేయి వైపునకు చూసుకుంటూ కనిపించాడు. దీంతో అతనికి గాయం అయిందేమో అని అంతా ఆందోళన చెందారు. కానీ ఆ వెంటనే ఎప్పటిలాగే లేచి నడవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత బౌలింగ్ కూడా చేసిన సిరాజ్ ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో సిరాజ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సిరాజ్ మియా నువ్వు కేక’ అంటూ రాసుకొస్తున్నారు.


ఇక టీమిండియా బౌలర్ల విజృంభణతో మొదటి ఇన్నింగ్స్‌లో అతిథ్య వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో అలిక్‌ అథనజె ఒక్కడే 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా 3 వికెట్లతో రాణించాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. కాగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో 30 పరుగులతో రోహిత్ శర్మ, 40 పరుగులతో యశస్వి జైస్వాల్ ఉన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఇంకా 70 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

Updated Date - 2023-07-13T12:09:39+05:30 IST