IND vs WI 2nd Test: మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్కోర్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-07-22T21:48:25+05:30 IST

భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం ఆటంకిగా మారింది. మూడో రోజు ఆటలో మొదటి సెషన్ మధ్యలోనే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఆగుతుందేమో అని కాసేపు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది.

IND vs WI 2nd Test: మూడో రోజు ఆటకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్కోర్ ఎంతంటే..?

డొమినికా: భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటకు వర్షం ఆటంకిగా మారింది. మూడో రోజు ఆటలో మొదటి సెషన్ మధ్యలోనే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం ఆగుతుందేమో అని కాసేపు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో 8 గంటల 53 నిమిషాల సమయంలో పరిస్థితిని పరిశీలించిన అంపైర్లు వర్షం ఇప్పట్లో ఆగేలా కనిపించక పోవడంతో ముందుగానే లంచ్ బ్రేక్ ఇచ్చారు. కాగా వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 51.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మ్యాచ్ నిలిచి పోవడానికి ముందు ముఖేష్ కుమార్ వేసిన చివరి బంతికి కిర్క్ మెకెంజీ(32).. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముఖేష్ కుమార్‌కు ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌తోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.


వికెట్ నష్టానికి 86 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్ మరో 31 పరుగులు జోడించి మెకెంజీ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. మొదటి సెషన్‌లో కేవలం 10.4 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 438 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కన్నా వెస్టిండీస్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.

Updated Date - 2023-07-22T21:48:25+05:30 IST