India vs Sri Lanka 2nd ODI: శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే..
ABN , First Publish Date - 2023-01-12T16:54:02+05:30 IST
భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్ రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి లంక బ్యాట్స్‌మెన్లకు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి 215 పరుగులకే ఆలౌట్ చేశారు.
కోల్‌కతా: భారత్ వర్సెస్ శ్రీలంక (India Vs Srilanka) వన్డే సిరీస్ రెండో వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి లంక బ్యాట్స్‌మెన్లకు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసి 215 పరుగులకే ఆలౌట్ చేశారు. 39.4 ఓవర్లలోనే లంక బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేశారు. భారత్ బౌలర్లలో అత్యధికంగా కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసి శ్రీలంక నడ్డివిరిచారు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది. నువనిడు ఫెర్నాండోను శుభ్‌మన్ గిల్/రాహుల్ రనౌట్‌గా వెనక్కుపంపారు.
కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఆరంభంలో ఆచితూచి ఆడారు. 29 పరుగులకే తొలి వికెట్ పడినా.. ఆ తర్వాత 102 పరుగుల వద్ద 2వ వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. కేవలం 50 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 6 వికెట్లు నష్టపోయింది. 152 పరుగుల వద్ద ఏడవ వికెట్ పడింది. చివరిలో టెయిలండర్లు ఫర్వాలేదనిపించడంతో ఈమాత్రం స్కోరైనా వచ్చింది.
శ్రీలంక బ్యాటింగ్: అవిష్క ఫెర్నాండో (20), నువినిండు ఫెర్నాండో (50, రనౌట్), కుశాల్ మెండిస్ (34), ధనంజయ్ డిసిల్వా (0), చరిత అసలంక (15), దసున్ షణక (2), వణిందు హసరంగ (21), దునిత్ వెల్లలాగె (23), చమిక కరుణరత్నే (17), కసున్ రజిత (17 నాటౌట్), లహిరు కుమార (0). కాగా లంక బ్యాట్స్‌మెన్లలో అత్యధిక స్కోరు చేసిన నువినిండు ఫెర్నాండో(50) రనౌట్ రూపంలో ఔటవ్వడం గమనార్హం.