ODI World Cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ మార్పుపై జైషా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2023-07-27T21:01:12+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌పై ఉత్కంఠ వీడడం లేదు. వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర స్థాయి సంఘాలతో నేడు బీసీసీఐ కార్యదర్శి జైషా ఢీల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ODI World Cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ మార్పుపై జైషా కీలక ప్రకటన

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌పై ఉత్కంఠ వీడడం లేదు. వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర స్థాయి సంఘాలతో నేడు బీసీసీఐ కార్యదర్శి జైషా ఢీల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూల్ మార్పుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమావేశం అనంతరం జైషా మీడియాతో మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు గురించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే తుది నిర్ణయానికి వచ్చే ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తో చర్చిస్తామని చెప్పారు. మ్యాచ్‌ షెడ్యూల్‌లో మార్పు కోసం ఐసీసీని కోరినట్లు జైషా తెలిపారు. దీనిని బట్టి భారత్, పాక్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చు కానీ, వేదికలో మార్పు ఉండకపోవడమే మంచిదని ఆయన అన్నారు.


నిజానికి షెడ్యూల్ ప్రకారం గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. కానీ అదే రోజు నుంచి గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిన భద్రాతా సంస్థలు మ్యాచ్ తేదీని మార్చాల్సిందిగా కోరాయి. దీని ప్రకారం భారత్, పాక్ మ్యాచ్ ఒక రోజు ముందుగా అక్టోబర్ 14న జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అదే సమయంలో ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల గురించి కూడా రాష్ట్ర సంఘాలతో బీసీసీఐ చర్చించింది. స్టేడియాల లోపల పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్ల ఏర్పాట్ల గురించి కూడా చర్చించారు. అలాగే స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు ఉచిత నీటి సౌకర్యం కల్పించే అంశంపై కూడా చర్చించినట్లు జైషా తెలిపారు.

ఇక భారత్ వేదికగా జరగనునున్న వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 10 వేదికలలో జరగనుంది. అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తో కలిపి 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచైనా న్యూజిలాండ్ vs ఇంగ్లండ్, భారత్ vs పాకిస్థాన్, ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబై, కోల్‌కతాలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated Date - 2023-07-27T21:18:52+05:30 IST