హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టోర్నమెంట్‌లో విజేత.. జెఎన్‌టీయుహెచ్
ABN , First Publish Date - 2023-02-14T19:20:07+05:30 IST
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్‌లో జెఎన్‌టీయుహెచ్ (సౌత్‌జోన్) జట్టు విజేతగా నిలిచింది. ఎన్‌టీయుహెచ్ ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన..
హైదరాబాద్ : హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్‌లో జెఎన్‌టీయుహెచ్ (సౌత్‌జోన్) జట్టు విజేతగా నిలిచింది. ఎన్‌టీయుహెచ్ ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను (Volleyball tournament) నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్‌లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఈ పోటీల ఫైనల్స్‌లో 15–7, 15–13, 15–9 స్కోర్‌తో విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్‌టెక్నాలజీ (వీబీఐటీ)పై జెఎన్‌టీయుహెచ్ (సౌత్ జోన్) విజయం సాధించి చాంఫియన్‌షిప్ గెలుచుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే తమ ప్రయత్నాలలో భాగంగా జెఎన్‌టీయుహెచ్ (JNTUH) స్పోర్ట్స్ కౌన్సిల్‌తో కలిసి ఈ టోర్నమెంట్‌ని నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించడానికి కృషి చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. జెన్‌టీయుహెచ్ అందిస్తున్న ప్రోత్సాహంతో వాలీబాల్ క్రీడ పట్ల యువతకు తగిన అవగాహన కల్పిస్తూనే, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బ్రెజిల్, ఇటలీ, జపాన్ వంటి దేశాల్లో అభివృద్ధి చెందుతున్న వాలీబాల్ సంస్కృతిని అనుకరించే మార్గంలో భారతదేశం ఉందని అభిషేక్ రెడ్డి అన్నారు. బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాథమిక స్థాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉందని సహ యజమాని శ్యామ్ గోపు అన్నారు. పాఠశాల విద్యార్థుల కోసం ‘చోటు లీగ్స్’ను, అలాగే టీనేజర్ల కోసం ‘మస్తీ లీగ్స్’ను నిర్వహించడానికి ప్రణాళిక చేశామన్నారు. తద్వారా దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.