Gujarat vs Mumbai: గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2023-04-25T19:20:29+05:30 IST

ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Gujarat Titans vs Mumbai Indians) తలపడుతున్నాయి...

Gujarat vs Mumbai: గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. కెప్టెన్ రోహిత్ ఏం ఎంచుకున్నాడంటే..

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Gujarat Titans vs Mumbai Indians) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కష్టంగా ఉండడంతో బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. పిచ్ పరిస్థితులను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామన్నాడు. జోఫ్రా ఆర్చర్ స్థానంలో రీలే ఆడుతుండగా.. కుమార్ కార్తికేయ జట్టులోకి వస్తున్నాడని వివరించాడు.

తుది జట్లు ఇవే..

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మొహిత్ శర్మ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెమెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహల్ వధేర, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండుల్కర్, రిలే మెరిడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.

Updated Date - 2023-04-25T19:21:46+05:30 IST