IND vs PAK: పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. భారత్‌తో మ్యాచ్‌లో స్టార్ పేసర్ ఆడడం డౌటే!

ABN , First Publish Date - 2023-09-06T17:40:13+05:30 IST

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు.

IND vs PAK: పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. భారత్‌తో మ్యాచ్‌లో స్టార్ పేసర్ ఆడడం డౌటే!

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు. ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో నసీమ్ షా భుజానికి గాయం అయింది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ నాటికి నసీమ్ షా కోలుకుంటాడా? లేదా? అనేది చూడాలి. ఒక వేళ నసీమ్ షా కనుక దూరమైతే పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే! బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది ఏడో ఓవర్ వేశాడు. ఆఫ్రిది వేసిన బంతి బంగ్లాదేశ్ బ్యాటర్ మహమ్మద్ నయీమ్ ప్యాడ్‌కు తగిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ వైపు వెళ్లింది.


దీంతో బౌండరీ లైన్ ఫీల్డింగ్ చేస్తున్న నసీమ్ షా వేగంగా పరిగెత్తి బంతిని ఆపేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతని కుడి భుజానికి గాయమైంది. టీమ్ ఫిజియో వచ్చి పరీక్షించాక నసీమ్ షా మైదానాన్ని వీడాడు. గాయం పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సూపర్ 4లో భాగంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో నసీమ్ షా ఆడడం అనుమానంగా కనిపిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. అయితే దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరే నసీమ్ షా పాక్‌కు కీలక ఆటగాడు. ఆసియా కప్ లీగ్ స్టేజ్‌లో భాగంగా భారత్‌‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నసీమ్ షా 3 వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. కాగా సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 10న మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-06T17:41:09+05:30 IST