IND vs WI 2nd Test: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. జయవర్దనే రికార్డు బద్దలు
ABN , First Publish Date - 2023-07-23T21:17:35+05:30 IST
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగతంగా రెండో ఇన్నింగ్స్‌లో రెండెంకెల స్కోర్ చేరుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో రెండెంకెల స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
డొమినికా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగతంగా రెండో ఇన్నింగ్స్‌లో రెండెంకెల స్కోర్ చేరుకోవడం ద్వారా టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో వరుసగా అత్యధిక ఇన్నింగ్స్‌ల్లో రెండెంకెల స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. కాగా రోహిత్ శర్మ వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండెంకెల స్కోర్‌ను నమోదు చేశాడు. 2021-2023 మధ్య కాలంలో రోహిత్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. కాగా జయవర్దనే 2001-2002 మధ్య కాలంలో వరుసగా 29 సార్లు రెండెంకెల స్కోర్‌ను నమోదు చేశాడు.
ఇక మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 183 పరుగుల భారీ అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ టీ20 తరహా బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగుల పెట్టించారు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో భారత తరఫున మొదటి వికెట్‌కు వేగంగా 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రోహిత్-జైస్వాల్ రికార్డు నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 4 ఫోర్లు, 3 సిక్సులతో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్‌కు ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. అలాగే టెస్టు కెరీర్లో రోహిత్ శర్మకు ఇది 16వ హాఫ్ సెంచరీ. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 438 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 255 పరుగులు చేసింది.