Rohit Sharma: ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-06-27T16:26:38+05:30 IST

ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌పై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) శర్మ స్పందిస్తూ "ఆట వేగంగా మారింది" కాబట్టి దేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ అత్యంత పోటీగా ఉంటుందని తెలిపాడు.

Rohit Sharma: ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌పై రోహిత్ శర్మ ఏమన్నారంటే..

ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌పై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) శర్మ స్పందిస్తూ "ఆట వేగంగా మారింది" కాబట్టి దేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ అత్యంత పోటీగా ఉంటుందని తెలిపాడు. ట్వంటీ-20 క్రికెట్ ఆట స్లామ్ బ్యాంగ్ వెర్షన్ అన్ని ఫార్మాట్‌లను ప్రభావితం చేసిందన్నారు. ఐదు రోజుల గేమ్‌లతో సహా బ్యాటర్‌లు తమ స్ట్రోక్‌లకు వెళ్లడానికి ఇష్టపడరున్నారు. భారత్ తన తొమ్మిది లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, లక్నో, బెంగళూరు సహా వివిధ వేదికలలో ఆడుతుంది. 'ఈ ప్రపంచ కప్ చాలా పోటీని ఇస్తుందని, ఎందుకంటే ఆట వేగంగా మారిందని, జట్లు గతంలో కంటే సానుకూలంగా ఆడుతున్నాయి" అని రోహిత్ పేర్కొన్నాడు.

భారత్ షెడ్యూల్:

అక్టోబర్ 8న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, అక్టోబర్ 11న చెన్నైలో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, అక్టోబరు 15న ఢిల్లీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్, అక్టోబర్ 19న అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, పుణెలో అక్టోబర్ 22న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ధర్మశాలలో అక్టోబర్ 29 ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, లక్నోలో ఇండియా vs క్వాలిఫైయర్ 2, నవంబర్ 2న ముంబైలో ఇండియా vs సౌతాఫ్రికా, నవంబర్ 5న కోల్‌కతాలో ఇండియా vs క్వాలిఫైయర్ 1, నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫైయర్ 1తో టీం ఇండియా ఆడనుంది. అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2023-06-27T16:29:50+05:30 IST