Supreme Court: మహిళా రెజ్లర్ల వినతిపై ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు
ABN , First Publish Date - 2023-04-25T11:29:25+05:30 IST
మహిళా రెజ్లర్ల వినతిపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది...
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్ల వినతిపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.(Supreme Court)రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై(women wrestlers’ plea) సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు(Notice) జారీ చేసింది.
ఇది కూడా చదవండి : Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం...భక్తుల పూజలు
రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పలువురు ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నారు.తమపై లైంగిక వేధింపులు సాగుతున్నాయని అంతర్జాతీయ మహిళా రెజ్లర్లు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీచేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28వతేదీ శుక్రవారం జరగనుంది.