WTC Final 2023: అజింక్యా రహానేకు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా
ABN , First Publish Date - 2023-06-06T17:00:53+05:30 IST
ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌కు ముందు భారత క్రికెటర్ అజింక్యా రహానేకు (Ajinkya Rahane) భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ (India coach Rahul Dravid) సలహా ఇచ్చాడు.
లండన్: ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌కు ముందు భారత క్రికెటర్ అజింక్యా రహానేకు (Ajinkya Rahane) భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ (India coach Rahul Dravid) సలహా ఇచ్చాడు. రహానే తన వ్యక్తిగత ప్రదర్శనను గ్రూప్‌లో సహచరులకూ అందించాలని రాహుల్ ద్రవిడ్ సలహా ఇచ్చాడు. ఇది నిజంగా ముఖ్యమైన విషయమని చెప్పాడు.
అజింక్య రహానే 18 నెలల్లో తన మొదటి టెస్టు ఆడబోతున్నాడు. అనుభవజ్ఞుడైన బ్యాటర్ రహానేను కలిగి ఉండటం మంచిదని, ప్రతిభ గల వ్యక్తిని తిరిగి పొందడం తమకు గొప్పగా ఉందని ద్రవిడ్ అన్నాడు. రహానే ఇంగ్లాండ్‌లో కూడా కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని, స్లిప్స్‌లో అద్భుతమైన క్యాచింగ్‌ని అందుకుంటాడని ద్రవిడ్ చెప్పాడు.
అనుభవజ్ఞుడైన అతను దేశం కోసం మరిన్ని మ్యాచ్‌లు ఆడవచ్చని ద్రవిడ్ చెప్పాడు. బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.