Nirmal District: బాసర సరస్వతీ దేవి ఆలయంలో కలకలం..

ABN , First Publish Date - 2023-03-21T11:10:26+05:30 IST

నిర్మల్ జిల్లా: బాసర (Basara) జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కలకలం రేగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి గర్భగుడిలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

Nirmal District: బాసర సరస్వతీ దేవి ఆలయంలో కలకలం..

నిర్మల్ జిల్లా: బాసర (Basara) జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో కలకలం రేగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి గర్భగుడిలో ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. చేతి మణికట్టు కోసుకుని రక్త తర్పణం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆ వ్యక్తిని బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. కాగా గతంలో ప్రసాద్ గౌడ్ రెండు సార్లు ఆలయంలో ఆత్మహత్య యత్నం చేసినట్లు సమాచారం. అతను నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-03-21T11:10:26+05:30 IST