Bhatti Vikramarka: ప్రధాని మోదీకి భట్టి బహిరంగ లేఖ..కేసీఆర్కు మీకు ఉన్న ఒప్పందం ఏమిటీ..?
ABN , First Publish Date - 2023-04-07T11:24:06+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) బహిరంగ లేఖ
మంచిర్యాల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) బహిరంగ లేఖ రాశారు. మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో 30 ప్రశ్నలతో కూడిన లేఖను భట్టి విడుదల చేశారు. లేఖలో ప్రధాని మోదీకి భట్టి పలు ప్రశ్నల సందించారు.‘‘ మీ 9ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి..? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి..? కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram project) సీబీఐ విచారణ(CBI investigation) ఎందుకు జరపడం లేదు..మీకు కేసీఆర్కున్న(cm KCR) లోపాయికార ఒప్పందం ఏమిటీ..? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభ కోణాలపై(Sahara, ESI Aquarius angles) ఎందుకు మౌనం పాటిస్తున్నారు?. కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులో(Liquor scam case) పురోగతి ఎందుకు లేదు.? మీకు కేసీఆర్కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు.ఝ.గిరిజన యూనివర్సిటీ ఏమైంది’’ అని మోదీకి లేఖలో భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీక్ వీరులు, లిక్కర్ వీరులు..
కాగా,..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. అనంతరం విక్రమార్క పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భట్టి పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress party in Telangana) అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల సమస్యలను, వారి బాధలను తెలుసుకుని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇప్పుడు భట్టి చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ మరింత ఊపందుకుంది. దీంతో హస్తం శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది.