Harish Rao: నీతో కాదు మాజీ సీఎంలతో చర్చకు సిద్ధం.. రేవంత్‌కు హరీష్‌రావు సవాల్

ABN , First Publish Date - 2023-10-07T14:01:57+05:30 IST

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్ అవుట్ ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు.

Harish Rao: నీతో కాదు మాజీ సీఎంలతో చర్చకు సిద్ధం.. రేవంత్‌కు హరీష్‌రావు సవాల్

మంచిర్యాల: ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్ అవుట్ ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు (Minister Harish Rao) ధీమా వ్యక్తం చేశారు. శనివారం చెన్నూరులో బీఆర్ఎస్ భారీ రోడ్ షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన వంద సీట్లతో బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రాబోతోందన్నారు. కర్ణాటక అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఇక్కడ గెలవాలని అనుకుంటోందన్నారు. ‘‘రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) 10ఏళ్ల పాలనపై చర్చ అంటున్నారు. నీతో కాదు మాజీ ముఖ్య మంత్రులతో చర్చకు సిద్ధం. నాడు సోనియా గాంధీని బలి దేవత అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రేపు ఏ పార్టీలోకి పోతడో తెలువదు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు. హైదరాబాద్‌లో మతం మంటలు పెట్టిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై సర్వే చేస్తామని.. అవసరమైతే కర కట్టలు కడతామని.. భూసేకరణ జరిపి రైతులను ఆదుకుంటామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-07T15:49:39+05:30 IST