TS News: మంచిర్యాల ఆస్పత్రిలో శిశువుల తారుమారుపై వీడిన సస్పెన్స్

ABN , First Publish Date - 2023-01-03T13:58:33+05:30 IST

జిల్లా ఆసుపత్రిలో శిశువుల తారుమారుపై సస్పెన్స్ వీడింది.

TS News: మంచిర్యాల ఆస్పత్రిలో శిశువుల తారుమారుపై వీడిన సస్పెన్స్

మంచిర్యాల: జిల్లా ఆసుపత్రిలో శిశువుల తారుమారుపై సస్పెన్స్ వీడింది. డీఎన్ఏ నివేదికతో ఉత్కంఠకు తెర పడింది. డీసీపీ కార్యాలయంలో అధికారులు... డీఎన్ఏ రిపోర్ట్ షీల్డ్ కవర్‌ను విప్పారు. పుట్టిన బాబు ఆసిఫాబాద్‌కు చెందిన పావని బిడ్డగా నిర్దారించారు. అలాగే పాప కోటపల్లి మండలం రొయ్యల పల్లికి చెందిన మమత బిడ్డగా గుర్తించారు. అనంతరం ఇద్దరు శిశువుల తండ్రులకు డీసీపీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గత నెల 27న జిల్లా ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు తారుమారు అయ్యారు. బాబు కోసం రెండు కుటుంబాల పట్టుబట్టాయి. నిజాన్ని తెల్చేందుకు అధికారులు డీఎన్ఏ టెస్టు నిర్వహించారు. శిశువులను ఆయా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సూపరిండెంట్ డా. హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-03T13:58:34+05:30 IST