Arvind: కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వస్తోంది
ABN , First Publish Date - 2023-07-04T19:04:32+05:30 IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) స్పష్టం చేశారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) స్పష్టం చేశారు. పార్టీలో గ్రూప్ తగాదాలను సమన్వయం చేసుకుంటామని అర్వింద్ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన అనేది ప్రచారం మాత్రమే అని ఎంపీ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నేతలను కలవడంలో తప్పేముందని, తాను కూడా డిల్లీలో అనేక మంది కాంగ్రెస్ నేతలను కలుస్తుంటాననని అర్వింద్ వెల్లడించారు. అంతమాత్రనా పార్టీ మారిపోతున్నట్లా? అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.