BJP: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా
ABN , First Publish Date - 2023-11-17T21:49:40+05:30 IST
రేపు బీజేపీ పార్టీ మేనిఫెస్టో ( BJP Manifesto ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) విడుదల చేయనున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో ఉండనున్నది.
హైదరాబాద్: రేపు బీజేపీ పార్టీ మేనిఫెస్టో ( BJP Manifesto ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) విడుదల చేయనున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ మేనిఫెస్టో ఉండనున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండేలా బీజేపీ అగ్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడంతో బీజేపీ కార్యకర్తలు , నేతలు మేనిఫెస్టో కోసం ఎదురుచూస్తున్నారు.
మేనిఫెస్టోలో కొన్ని అంశాలు
1.ధరణి స్థానంలో మీ భూమి యాప్
2. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ
3. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ
4. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్
5. 4శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత
6. సబ్సిడీపై విత్తనాలు... వరి పంటకు బోనస్
7. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 ఏళ్లు వచ్చేసరికి 2లక్షల రూపాయలు
8. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు
9. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు
10. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ
11. బడ్జెట్ స్కూల్స్‌కు పన్ను మనిహాయింపులు
12. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు
13. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
14. ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు
15. PRCపై రివ్యూ... ప్రతి ఐదేళ్లకు ఓసారి PRC.
జీఓ 317పై పునః సమీక్ష
16. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్‌లు
17. ఐదేళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ధి నిధి
18. రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం
19. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం..
20. అన్ని పంటలకు పంట బీమా... బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది
21. ఐదేళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలు
22. వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణ
వంటి అంశాలను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.