Share News

Annamalai: కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారు

ABN , First Publish Date - 2023-11-21T18:05:09+05:30 IST

కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ జాతీయ నాయకుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు.

Annamalai: కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారు

హైదరాబాద్: కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ జాతీయ నాయకుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ...‘‘తెలంగాణలో కేసీఆర్ పార్టీ.. కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారింది. పార్టీ ఒక వ్యక్తి , ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు. శ్రీలంకలో కూడా ఇలాగే కుటుంబ పాలనతోనే దేశం నాశనం అయ్యింది. రాష్ట్రం విడిపోయినప్పడు కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు’’ అని అన్నామలై ఆరోపించారు.


Annamalai.jpg

దేశమంతా మోదీ..!

‘‘8 కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు ఉంటే... 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మట్టం 6.5 లక్షల అప్పులో కూరుకుపోయింది. దేశం అంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటున్నారు.కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్‌గా మారింది.బీజేపీ హయంలో అన్నివర్గాల ప్రజలను ఆదుకున్నాం. బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకు బీ టీం. ఎఐఎం బీఆర్ఎస్‌కు బీ టీం. మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు ఇన్సూరెన్స్‌ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మినీ ఇండియాగా శేరిలింగంపల్లి నియోజకవర్గo ఉంది. అన్నివర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో బీజేపీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్‌ను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపింది. రవికుమార్ యాదవ్ లాంటి ఒక మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలి’’ అని అన్నామలై కోరారు.

Updated Date - 2023-11-21T20:06:38+05:30 IST