Share News

TS Polls: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన మరో బీఆర్‌ఎస్ నేత

ABN , First Publish Date - 2023-11-30T09:28:57+05:30 IST

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్‌‌లో ఓటు వేసిన అనంతరం బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరుతూ కోడ్‌ను ఉల్లఘించారు.

TS Polls: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన మరో బీఆర్‌ఎస్ నేత

మంచిర్యాల: తెలంగాణలో ఎన్నికల (Telangana Elections) వేళ బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavithha) బంజారాహిల్స్‌లో ఓటు వేసిన అనంతరం బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరుతూ కోడ్‌ను ఉల్లఘించారు. ఇప్పుడు తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య (BRS candidate is Durgam Chinnaiah) కూడా కోడ్‌ను ఉల్లంఘించారు. బీఆర్ఎస్ (BRS) కండువాతో వెళ్ళి మరీ చిన్నయ్య ఓటు వేశారు. నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ 219 పోలింగ్ కేంద్రంలో చిన్నయ్య కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఈ విధంగా కోడ్‌ను ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల మిగిలిన పార్టీల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తెలంగాణ సీఈవో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T10:53:24+05:30 IST