Share News

Bhatti Vikramarka : దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా?

ABN , First Publish Date - 2023-11-18T12:43:45+05:30 IST

ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముదిగొండ మండలం లక్ష్మీపురం ఎన్నికల ప్రచారంలో దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అనేది తేల్చుకునే ఎన్నికలు ఇవని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామన్నారు. రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

Bhatti Vikramarka : దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా?

ఖమ్మం : ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ముదిగొండ మండలం లక్ష్మీపురం ఎన్నికల ప్రచారంలో దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అనేది తేల్చుకునే ఎన్నికలు ఇవని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామన్నారు. రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని భట్టి పేర్కొన్నారు.

మహిళలకు ప్రతి నెల 2500, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ముదిగొండ మండలంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి పాలకులు తినకుండా ప్రజలకు పంచేలా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలవబోతున్నామని భట్టి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-18T12:43:56+05:30 IST