Share News

Dharmapuri Arvind: బీఆర్ఎస్ ఉండదు.. కాంగ్రెస్, బీజేపీలే ఉంటాయి

ABN , First Publish Date - 2023-12-04T17:02:33+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను.

Dharmapuri Arvind: బీఆర్ఎస్ ఉండదు.. కాంగ్రెస్, బీజేపీలే ఉంటాయి

ఢిల్లీ: కేసీఆర్ శకం ముగిసింది.. బీఆర్ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) జోస్యం చెప్పారు. అరవింద్ మీడియాతో మాట్లాడారు. ‘‘సంవత్సరం క్రితం వరకు తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలా డెవలప్ అయి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి.. హుందాతనమైన భాష ఇప్పుడు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా భాష ఉండదని.. దాడుల సంస్కృతి ఉండదని భావిస్తున్నాం. నీచమైన రాజకీయాలకు స్వస్తి పలుకుతూ స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం తెలంగాణలో. ఎందుకు బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయన్న చర్చ అవసరం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది కాబట్టే ఈ ఫలితాలు వెలుపడ్డాయి. లిక్కర్ కేసులో కవితను జైలుకు పంపకపోవడం కూడా ఒక కారణం. దీనిపైన పార్టీలో చర్చ అవసరం.’’ అని తెలిపారు.

‘‘రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను. నా పార్లమెంటు పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. కోరుట్ల ప్రజలందరికీ ధన్యవాదాలు... నన్ను పార్లమెంట్ అభ్యర్థిగానే చూశారు జనాలు. ఒక్క నయా పైసా పంచకుండా రాజకీయాలు చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచింది. అది నా నియోజకవర్గంలో కూడా ఎఫెక్ట్ చూపించింది. నా పైన గెలిచిన అభ్యర్థి రూ.34 కోట్లు ఖర్చు చేశారు. రేవంత్ కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఆయనకు నా శుభాకాంక్షలు.’’ తెలుపుతున్నట్లు అరవింద్ పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-04T17:04:52+05:30 IST