Share News

Telangana Elections: రేవంత్‌పై సీఈవోకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-11-30T13:03:54+05:30 IST

Telangana Elections: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ భేటీ అయ్యింది. సైలెంట్ పీరియడ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాయిలెట్ చేశారని ఫిర్యాదు చేసింది.. సీఈవోతో భేటీ అనంతరం లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.

Telangana Elections: రేవంత్‌పై సీఈవోకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌‌తో (Telangana CEO Vikasraj బీఆర్‌ఎస్ లీగల్ సెల్ (BRS Legal Cell) భేటీ అయ్యింది. సైలెంట్ పీరియడ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాయిలెట్ చేశారని ఫిర్యాదు చేసింది. సీఈవోతో భేటీ అనంతరం లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. సైలెంట్ పీరియడ్‌లో రాజకీయ నాయకులు మాట్లాడొద్దని చట్టం ఉందన్నారు. గుళ్లను, ప్రార్థనా మందిరాలను రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు వాడుకున్నారని ఆరోపించారు. ఓటు వేసి ఓటర్లను ప్రలోభపెట్టేలాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.


రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించినట్లే అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ, ఈసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేటీఆర్ పేరుతో ఏ1 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేటీఆర్ పేరుతో తప్పుడు ప్రచారం చేయబోతున్నామని డీజీపీకి ముందుగానే ఫిర్యాధు చేసామని.. తాము చేసిన గంటకే ఫేక్ వీడియో బయటకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసే నాయకులు ఎక్కువగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయని సోమా భరత్ ఆరోపించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T14:11:33+05:30 IST