Kavitha: ప్రశ్నించడం తెలంగాణ రక్తంలోనే ఉంది..
ABN , First Publish Date - 2023-11-23T14:59:16+05:30 IST
Telangana Elections: ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం విద్యార్థులు, కొత్త ఓటర్లలతో ఇంటరాక్షన్‌లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాశీగా తీసుకోవద్దన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛ యుతంగా ఉండటం అనేది ముఖ్యమన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని.. ప్రశ్నించటం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు.
నిజామాబాద్: ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. గురువారం విద్యార్థులు, కొత్త ఓటర్లలతో ఇంటరాక్షన్‌లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాశీగా తీసుకోవద్దన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛ యుతంగా ఉండటం అనేది ముఖ్యమన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని.. ప్రశ్నించటం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు. దేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన ఆంగ్లేయులు దేశ ప్రజల స్వేచ్ఛను హరించారన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇండియా అని అన్నారు.
యువత తమ వాయిస్‌ను వినిపించేందుకు ఉన్న సోషల్ మీడియాను వాడుకోవాలని సూచించారు. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే దేశ యువతకు తీరని అన్యాయం జరుగుతాయని.. యువత భవిష్యత్‌పై ప్రభావం ఉంటదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అడవుల శాతం పెరగలేదని.. కానీ తెలంగాణలో తమ ప్రభుత్వ సంకల్పం వల్ల ఇది సాధ్యమైందన్నారు. సైనికులు బార్డర్‌లో నిలబడి దేశం కోసం యుద్ధం చేస్తున్నారని.. యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి జరగాలంటే యువత ఓటింగ్‌లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పట్టణాల కంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని.. యువతలో చైతన్యం రావాలన్నారు. మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుందని తెలిపారు. మహిళలు బాధ్యతాయుతంగా ఆలోచిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి