Home » Vikas Raj
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)గా సి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికా్‌సరాజ్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. 2
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు(శుక్రవారం) ఉత్తర్వులు వెలువరించింది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.
లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.
తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ పూర్తి అయి, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారన్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో భారీ సంఖ్యలో క్యూలైన్లో ఓటర్లు ఉన్నారన్నారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కొంత ఆలస్యమైందని తెలిపారు.
ప్రచారపర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగేవరకు రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికా్‌సరాజ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. నలుగురికంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు.